మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోండి.. నెతన్యాహుకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement
- ట్రంప్‌తో కలిసి ఇరాన్‌ను అంతం చేస్తామన్న నెతన్యాహు
- జైలుకు వెళ్లకుండా ఉండేందుకే నెతన్యాహు యుద్ధాన్ని కోరుకుంటున్నారని ఆరోపణ
- నెతన్యాహు గొప్ప యోధుడంటూ ట్రంప్ బహిరంగ మద్దతు
- ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ముదురుతున్న మాటల యుద్ధం
Advertisement
"మరోసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారా? మాకేం అభ్యంతరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండండి.. మాకు కూడా పూర్తి చేయాల్సిన పనులు కొన్ని మిగిలే ఉన్నాయి" ఇవి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును ఉద్దేశించి ఇరాన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు. తాను మళ్లీ ఎన్నికైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి "ఇరాన్ ముప్పును" పూర్తిగా తుడిచిపెడతానంటూ నెతన్యాహు చేసిన ప్రచార ప్రకటనలపై ఇరాన్ తీవ్రస్థాయిలో స్పందించింది. అమెరికాను మరో యుద్ధంలోకి లాగేందుకే నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సవాల్ విసిరారు.
అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నెతన్యాహు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, ట్రంప్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ తన లికుడ్ పార్టీ తరఫున ఒక వీడియోను విడుదల చేశారు. "గతంలో తామిద్దరం కలిసి ఇరాన్‌ను అణిచివేశాం. మళ్లీ అధికారంలోకి వస్తే రాబోయే రెండేళ్లలో, లేదా అంతకంటే ముందే ఇరాన్ ముప్పును పూర్తిగా నిర్మూలిస్తాం" అని నెతన్యాహు ఆ వీడియోలో పేర్కొన్నారు. తనకు మద్దతిచ్చినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, "కలిసికట్టుగా మనం ఈ లక్ష్యాన్ని పూర్తిచేద్దాం!" అని పోస్ట్ చేశారు.
నెతన్యాహు వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ 'ఎక్స్' వేదికగా తీవ్రంగా బదులిచ్చారు. "గతంలో మీరు 'పని పూర్తి చేయాలనుకున్నప్పుడు' ఇరాన్ మరింత బలంగా పుంజుకుంది. మళ్లీ మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారా? సరే, మీ ఇష్టం. కానీ జాగ్రత్త, మాకు కూడా కొన్ని పనులు మిగిలే ఉన్నాయి" అని హెచ్చరించారు. "జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికే నెతన్యాహు అమెరికాను మరో యుద్ధంలోకి లాగుతున్నారు. దీనివల్ల ఇజ్రాయెల్‌కు ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఆయనకు పట్టింపు లేదు" అని అరఘ్చీ ఆరోపించారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో నెతన్యాహుకు బహిరంగ మద్దతు ప్రకటించారు. నెతన్యాహును "గొప్ప యోధుడు" అని, ఇరాన్‌ను ఎదుర్కోవడంలో "శాంతి స్థాపనలో భాగస్వామి" అని అభివర్ణించారు. అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో జరుగుతున్న మొదటి జాతీయ ఎన్నికల ముందు, ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.